విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి సత్తిబాబు.. కరోనాతో మృతి చెందారు. పట్టణంలోని వస్త్ర వ్యాపారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారంతా పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించారు. ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
కొద్ది రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సత్తిబాబు చికిత్స పొందారు. పరిస్థితి విషమిస్తుండగా.. ఆయన్ను అత్యవసర వైద్యం నిమిత్తం హైదరాబాద్కు తరలించే యత్నంలో దారిలోనే చనిపోయారని తోటి వ్యాపారులు తెలిపారు.
ఇదీ చదవండి: