విశాఖ మన్యం కొయ్యూరు మండల కేంద్రం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాడేరు మండలం గురుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి... కొయ్యూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థులంతా సంక్రాంతి సెలవులకని స్వగ్రామాలకు వెళ్లారు. సదరు విద్యార్థి కూడా సెలవులకు ఇంటికి వెళ్తున్నట్లు రిజిష్టర్లో సంతకం చేశాడు.
ఉదయం పాఠశాల వాచ్మెన్ వసతి గృహాల గదులకు తాళాలు వేస్తుండగా... వసతి గదిలో విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకు తెలియజేశారు. ప్రిన్సిపల్ కొయ్యూరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థి మృతదేహానికి పంచనామా నిర్వహించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: