విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిచేసే వ్యక్తికి కోవిడ్ సోకగా.. అక్కడి పరిసర ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. లాక్డౌన్ సడలింపులు అమలు చేస్తున్నందున..కేసులు మరింత పెరిగే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
అనకాపల్లి పట్టణంలో గవరపాలెం, అనకాపల్లి, బౌలువాడ, బట్ల పూసి, సత్యనారాయణపురం, చినబాబు కాలనీ మొత్తం ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. చింతవారి వీధి, గాంధీ బొమ్మ సెంటర్, సుంకరమెట్ట కూడలి ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: