ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ మద్దిపాలెం కూడలిలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపకుడు ఫణిశయన సూరి మాట్లాడుతూ.. తెలుగు నేలలో మహావృక్షాలుగా ఎదగాల్సిన మన బిడ్డలను.. పొట్టి చెట్లుగా తయారు చేయాలనుకోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాథమిక విద్యాబోధన తప్పనిసరిగా మాతృభాషలోనే జరగాలని ఆయన కోరారు. ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తర విద్య వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు భాషను ప్రథమ పాఠ్యాంశంగా బోధించాలని డిమాండ్ చేశారు.