స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో పరిశ్రమల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెదేపా అర్బన్ ఉపాధ్యక్షుడు పాసర్ల ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలను ప్రమాదకర పరిశ్రమలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన విధంగా ఇండస్ట్రీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెంటర్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులను నియమించి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: