ETV Bharat / state

'ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు' - Visapatnam District updated news

TDP Senior leaders fire on CM Jagan: 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, యువతను మభ్య పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బోండా ఉమాలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఆనాడూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ పరిశ్రమలన్నింటిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేని సీఎం.. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.

Tdp Leaders
Tdp Leaders
author img

By

Published : Mar 3, 2023, 5:57 PM IST

Updated : Mar 3, 2023, 6:42 PM IST

TDP Senior leaders fire on CM Jagan: 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, యువతను మభ్య పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బోండా ఉమాలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఆనాడూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ పరిశ్రమలన్నింటినీ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేని సీఎం.. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, బోండా ఉమా ఆధ్వర్యంలో ఈరోజు మీడిాయా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా 'రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా, ఆ జిల్లా.. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల లిస్ట్'ను విడుదల చేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ..గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకొస్తే.. అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఆ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని విమర్శించారు. గత మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేని ముఖ్యమంత్రి.. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.

టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మాట్లాడుతూ.. దాదాపు నాలుగేళ్లు పూర్తి చేసుకొని మరో ఆరు నెలల్లో ఇంటికి వెళ్లిపోతున్నా వైసీపీ ప్రభుత్వం.. 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు' పేరుతో త్వరలోనే రానున్న ఎన్నికల్లో యువతను మభ్య పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సదస్సును ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉన్న పరిశ్రమల్ని వెళ్లగొట్టి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించడం ఎన్నికల కోసమేనని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను ముఖ్యమంత్రి జగన్ ఎందుకు వెళ్లగొట్టారో? ముందు ఆ విషయాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలా చెప్పని పక్షంలో ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు. పెట్టుబడులు తీసుకొచ్చామంటూ ఎందుకు యువతను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.55,273 కోట్ల భారాన్ని మోపిందని.. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు భారాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తామనడం అన్యాయమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దోపిడీ, అవినీతికి విద్యుత్ వినియోగదారులు బలి కావాలా? అని ప్రశ్నించారు. విద్యుత్ రంగానికి ఈ నాలుగేళ్లలో జగన్ చేసిందేమిటో? చెప్పాలని డిమాండ్ చేశారు. సౌర, పవన విద్యుత్‌ పీపీఏలను జగన్‌ రద్దు చేశారని గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలపై దాడులు చేయించారని, జగన్ పరిపాలనలో పరిశ్రమలకు పవర్ హాలీడేలేనని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

ఇవీ చదవండి

Last Updated : Mar 3, 2023, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.