ETV Bharat / state

ప్రైవేటీకరణను నిరసిస్తూ... విశాఖలో తెదేపా నేతల రిలే నిరాహార దీక్షలు - visakha steel plant latest news

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపానేత పల్లా శ్రీనివాస్ చేస్తున్న దీక్షకు తెదేపానేతలు సంఘీభావం ప్రకటించి.. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

TDP Leaders Relay Dheeksalu On Privatization
విశాఖలో తెదేపానేతల రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Feb 13, 2021, 4:47 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. మాజీ శాసనసభ్యులు, విశాఖ తెదేపా పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షకు గీతం విశ్వవిద్యాలయం చైర్మన్, విశాఖ తెదేపా సీనియర్ నాయకులు ఎం.భరత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మద్దతు తెలిపారు.

32 మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తాననడం దారుణమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా గాజువాకలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా.. కేంద్రం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది కుటుంబాలు స్టీల్ ప్లాంట్​పై ఆధారపడి జీవిస్తున్నాయని, అటువంటి ఉక్కు కర్మాగారాన్ని పోస్కో కంపెనీకి కట్టబెట్టి వారిని రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ఏ సంస్థకైనా లాభ నష్టాలు రావడం వాస్తవమేనని... అంతమాత్రాన ప్రైవేటీకరణ చేయడం కరెక్టు కాదని పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: సమస్య చెప్పడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. మీరెవరో తెలియదన్న పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.