అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సుధాకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు... డా.సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా వేధించి బలిగొన్నారని ఆక్షేపించారు. వైద్యుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డా.సుధాకర్‌ను వేధించి హతమార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైద్యుడు సుధాకర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఇదీచదవండి