ETV Bharat / state

chinthamaneni: దెందులూరు పీఎస్‌కు తెదేపా నేత చింతమనేని తరలింపు

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ను విశాఖ నుంచి దెందులూరు పీఎస్‌కు పోలీసులు తరలించారు. నేడు ఏలూరులో మేజిస్ట్రేట్‌ ఇంటికెళ్లి చింతమనేనిని హాజరుపరిచే అవకాశం ఉంది.

TDP leader Chintamani Prabhakar
తెదేపా నేత చింతమనేని ప్రభాకర్​
author img

By

Published : Aug 30, 2021, 10:36 AM IST

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ను విశాఖ నుంచి దెందులూరు పీఎస్‌కు తరలించారు. నేడు కోర్టుకు సెలవు కావడంతో ఏలూరులో మేజిస్ట్రేట్‌ ఇంటికెళ్లి చింతమనేనిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్‌పై దెందులూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నిన్న పెట్రోల్‌, డీజిల్‌ పెంపు నిరసన కార్యక్రమంతో... తమ విధులకు చింతమనేని ఆటంకం కలిగించారని చింతపల్లి పోలీసులు కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్​ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న వారిని వేధించి అక్రమంగా జైలు పాలుజేయడమే ధ్యేయంగా జగన్మోహన్​ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపినవారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పౌరస్వేచ్ఛను ఎంతకాలం తొక్కిపెడతారని నిలదీశారు. విశాఖపట్నంలో వివాహ వేడుకకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్​ను అక్కడికి వెళ్లి మరి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటన్నారు. 13జిల్లాల్లో జగన్​ పాదయాత్రను తెదేపా ప్రభుత్వం అడ్డుకుని ఉంటే పరిస్థితి ఎంటన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్న తెదేపా నేతలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని రాజప్ప మండిపడ్డారు.

ఇదీ చదవండీ... visakha tourism : లంబసింగిలో పర్యటకశాఖ విడిది గృహాలు... ఎకోటూరిజం దిశగా దృష్టి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.