విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న పుష్పవనంలో మొక్కలు నాటి.. నాడు-నేడు కార్యక్రమాన్నిశారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి మొదలుపెట్టారు. గోశాల లే అవుట్లో బంగారమ్మ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు.. అప్పన్న పూల వనాన్ని అద్భుతంగా తీర్చి దిద్దాలని సంకల్పించడాన్ని అభినందించారు.
స్వామి సేవలో తన పేరిట మొక్క నాటడం పట్ల.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి భక్తుడికీ స్వామిసేవకు అవకాశం కల్పించే దిశగా కృషి చేస్తున్న ఆలయ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థాన సిబ్బందితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: