కరోనాతో అన్ని రంగాలూ కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌తో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రోడ్డు పక్క వ్యాపారులపై కూడా దీని ప్రభావం పడింది. వీరికి ప్రస్తుతం స్వనిధి పథకం అక్కరకు వస్తోంది. ప్రతి వ్యాపారికి రూ.10వేలు ఇస్తారు. ఈ సొమ్ముతో వ్యాపారం చేసుకుని నెలకు కొంత సొమ్ము వాయిదాగా చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల వడ్డీ వ్యాపారుల సమస్య నుంచి వీరికి విముక్తి కలుగుతుంది.
నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ఏడాది వీధుల్లో తిరిగే చిరు వృత్తులతో జీవనం సాగించే 480 నందిని మెప్మా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఈ ఏడాది కొత్తగా ఎంపిక చేసిన 580 మందిని కలిపి మొత్తం 1060 మందికి గుర్తింపు కార్డులు సైతం అందజేశారు. వీరిలో ఈ పథకానికి 520 మందిని అర్హులుగా నిర్ధరించారు.
మెప్మా గుర్తింపు పొందిన వీథి విక్రయదారులందరూ స్వనిధి కింద బ్యాంకు రుణాలు పొందవచ్ఛు ఎవరైతే ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారో వారికి పది రోజులలోపు రుణాలు మంజూరవుతాయి.
విశాఖ జిల్లాలో వీధి వ్యాపారుల వివరాలిలా.. | |
జీవీఎంసీ పరిధిలో | 15,760 |
ఎలమంచిలిలో | 600 |
నర్సీపట్నంలో | 1,060 |
ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం