ETV Bharat / state

ఒంటరిగా వచ్చి...వెయ్యిమందికి దారి చూపి! - prajwal vani foundation news

ఓ నిర్ణయం... ఆడపిల్లకు ఎలాగైనా పెళ్లి చేసి పంపాలనుకున్న సగటు తల్లిదండ్రులది. డిగ్రీ చదువుతూ, భవిష్యత్తును పంచరంగుల్లో ఊహించుకుంటున్న ఆమెను ఇల్లాలిని చేసింది. మరో నిర్ణయం... ఈసారి ఆమెది. మనసుకు తగిలిన గాయాలను కృషితో, పట్టుదలతో మాన్పుకోవాలనుకుంది. ఆ సంకల్పం వందల మంది బధిరులకు బతుకునిచ్చింది. ఆమెను ఓ వేగుచుక్కగా మార్చింది. ఇది విశాఖపట్నానికి చెందిన కంటిమహంతి సుచిత్రారావు కథ...

suchitra rao
సుచిత్రారావు
author img

By

Published : Dec 2, 2020, 6:29 PM IST

‘జీవితంలో ఏదీ సులువుగా దొరకదు. కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు అని నా అనుభవమే నాకు నేర్పింది. నేను పడ్డ కష్టాలకు ఒకానొక సమయంలో చనిపోవాలనీ అనుకున్నాను. క్షణికావేశంలో ఆరోజు ఆ నిర్ణయం తీసుకుంటే...ఈ రోజు నా గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగిలేది కాదు.’ అంటారు సుచిత్రారావు. జీవితంలో అడుగడుగునా సుడిగుండాలు చూసిన ఆమె ధైర్యంగా నిలబడడమే కాదు పదిమందికీ స్ఫూర్తినిస్తోంది. ఇప్పటివరకూ సుమారు వెయ్యిమందికిపైగా దివ్యాంగులు, మానసిక పరిణతలేని యువతకు ఉపాధినిచ్చింది. ఇదంతా సుచిత్ర ప్రారంభించిన ‘ప్రజ్వల్‌ వాణి’ సంస్థ ద్వారానే సాధ్యమైంది. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా వివరించారామె.

మాది విశాఖపట్నం. ఉన్నంతలో హాయిగా సాగిపోయేది మా కుటుంబం. నాకు పదిహేనేళ్లు వచ్చినప్పటి నుంచే తెలిసినవారంతా...నలుగురు ఆడపిల్లలు. వీరికి పెళ్లిళ్లెలా చేస్తారని ఆశ్చర్యపోయేవారు. ఈలోగా మా బంధువుల్లోనే ఓ సంబంధం వచ్చింది. ఇంట్లోవాళ్లు పెళ్లి చేశారు. అప్పటికి డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. కట్టుకున్నవాడు అప్పటికే మరో అమ్మాయికీ తన జీవితంలో స్థానం ఇచ్చాడని తెలిసి...షాకయ్యా. రోజులుగడుస్తున్నా. అతడి తీరులో మార్పు రాకపోవడంతో... గొడవపడ్డా. అది మొదలు దొరికిన ప్రతి అవకాశాన్నీ నన్ను వదిలించుకునేందుకు చూసేవాడు. అలా ఓసారి పుట్టింట్లో వదిలేసి స్థిరపడ్డాక వచ్చి నిన్ను తీసుకెళ్తా అన్నాడు. ఇక మరెప్పుడూ రాలేదు. మరోవైపు బంధువులు, చుట్టుపక్కల వారు...మాత్రం ఇంకెప్పుడు వెళ్తావ్‌ అత్తారింటికి అంటూ తరచూ ప్రశ్నించేవారు.

అలా నేర్చుకున్నా...
ఇలా ఎన్నాళ్లని ఇంట్లోనే ఉంటా...అందుకే నాన్నని ఒప్పించి చదువుకోవాలనుకున్నా. వోకేషనల్‌ డిగ్రీలో చేరా. కంప్యూటర్లు బాగుచేసే కోర్సు గురించి తెలుసుకోవడానికి జనశిక్షణ సంస్థాన్‌కి వెళ్లా. అక్కడ ‘ఈ పని నువ్వు నేర్చుకుంటావా’ అని ఆశ్చర్యపోయారు. అయినా మగవాళ్లే ఎందుకు నేర్చుకోవాలి? నేనూ చేయగలను అని చెప్పా. నా ఆసక్తిని గమనించిన వాళ్లు ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. నువ్వు ఆలోచించుకుని చెబితే...నేను అడ్మిషన్‌ ఇప్పిస్తా అన్నారు. అలా నేను హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టా. తోటి విద్యార్థులు ఆడపిల్లనని ఎగతాళి చేసేవారు అయినా పట్టుదలతో నేర్చుకున్నా. ఓ సారి ఓ నేవీ ఉద్యోగి కంప్యూటర్‌ బాగు చేస్తే 200 రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన.

ఆ రాత్రి ఇంట్లోంచి వచ్చేశా...
ఇలా సాగుతుండగా...నా భర్త నుంచి ఓ ఉత్తరం వచ్చింది. దిల్లీ అడ్రస్‌ని చెబుతూ రమ్మని దాని సారాంశం. దాన్ని చూసి నాన్న వెళ్లాల్సిందే...అన్నారు. ఈసారి నేను మొండికేశాను వెళ్లనని. ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు. నేను కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటపడ్డా. శిక్షణను కొనసాగించా. కొన్నాళ్లకు సంస్థ డైరెక్టర్‌ బాబయ్య నాకు అక్కడే ఫ్యాకల్టీగా అవకాశం ఇప్పించారు. ఆ సమయంలోనే ఓ సంఘటన జరిగింది.

జనశిక్షణకు కొంతమంది బధిరులు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకునేందుకు వచ్చారు. అప్పుడు నన్ను మా సార్‌లు పిలిచి...వీరికి ఎలా నేర్పాలి... మనకు సంజ్ఞల ద్వారా చెప్పడం రాదు కదా! అన్నారు. ఫరవాలేదు నాకొచ్చు అన్నా. ఎందుకంటే మా అక్క బధిరురాలు. తనని సాధారణ స్కూళ్లలో చేర్చుకోకపోవడంతో ఊరి చివరన ఉన్న ఓ ప్రత్యేక పాఠశాలలో చేర్చారు. తను ఒక్కతే వెళ్లి రావడం కష్టమని నన్నూ అక్కడికే పంపారు. దాంతో నాకు అది అలవాటయ్యింది. అదే నన్ను కొత్తమార్గంలో నడిపించింది.

ప్రత్యేక అవసరాలున్న వారికి ఉపాధి కల్పించడానికి ఓ సంస్థని ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు కొందరు. అలా ప్రజ్వల్‌ వాణి అనే సంస్థని నేను నా విద్యార్థి వడ్డాది హరీష్‌ కలిసి ప్రారంభించాం. రెండేళ్ల పాటు ఎటువంటి కార్యాలయం ఏర్పాటు చేయకుండా బయటి నుంచే అలాంటివారిని గుర్తించడం, వారికి శిక్షణ ఇప్పించడం...ఉపాధి చూపించడం చేసేదాన్ని. ఒకరి నుంచి మరొకరికి ఈ విషయం తెలియడంతో మేం ఊహించినదానికంటే ఎక్కువమంది మమ్మల్ని సంప్రదించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లయ్యాక ఓ అద్దె భవనం తీసుకుని కార్యక్రమాలు చేసేదాన్ని. క్రమంగా ఆటిజం చిన్నారులు, మానసిక దివ్యాంగులు...ఇలా వారి అవసరాలను బట్టి మా దగ్గరకు వచ్చేవారు. ఆ పిల్లల ఆసక్తిని బట్టి కోర్సులు రూపొందించాం. అంటే మా దగ్గర నేర్చుకున్న ఏ అంశమైనా వారి జీవితానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాం. ఇలా శిక్షణ తీసుకున్న సుమారు వెయ్యిమందికి పైగా ఈ రోజు ఉపాధి పొందారు. ప్రస్తుతం కోవిడ్‌ వల్ల తల్లులకు ఆన్‌లైన్‌ క్లాసులు అందిస్తున్నాం. అలా నేర్చుకున్న వాళ్లు తమ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఇవేకాదు... స్పీచ్‌, ఫిజియో థెరపీలనూ వారికి అలవాటు చేస్తున్నాం.

ఇదీ చదవండి: రాత్రి మగతకు చిరు సాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.