ETV Bharat / state

మొలకెత్తని వరి విత్తనాలు.. ఆందోళనలో రైతులు

రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ సరఫరా చేసిన రాయితీ వరి విత్తనాలు విశాఖ జిల్లాలో మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

subsidy paddy seeds supplied did not germinate in Visakhapatnam district
మొలకెత్తని వరి విత్తనాలు
author img

By

Published : Jul 19, 2020, 11:37 AM IST

రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ సరఫరా చేసిన రాయితీ వరి విత్తనాలు విశాఖ జిల్లాలో మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చీడికాడ మండలం జేబీపురం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ రాయితీపై సరఫరా చేసిన ఆర్​జెఎల్ వరి విత్తనాలు మొలకెత్తకపోవటంతో... రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జేబీపురం రైతు భరోసా కేంద్రం పరిధిలోని తునివలస, వింటిపాలెం గ్రామాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు.

అయితే ఈ విత్తనాలు చాలా ప్రాంతాల్లో 50 నుంచి 30 శాతం మాత్రమే మొలకెత్తాయని... దాదాపుగా వందమంది రైతులు నష్టపోయారని తునివలస మాజీ సర్పంచ్ పేరపు కొండబాబు, పలువురు రైతులు చెబుతున్నారు. దీని గురించి "ఈటీవీ భారత్" చీడికాడ మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లగా... పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

కేజీహెచ్‌లో కొవిడ్‌ టీకా ప్రయోగాలకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.