విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు గిరిజన గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, యువత.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఫోన్లకు సిగ్నల్ అందక ఆన్లైన్ తరగతులు వినేందుకు రక్షిత మంచినీటి పథకం ట్యాంక్, కొండలు ఎక్కాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తరగతుల నిర్వహణ ఆన్లైన్లోనే జరుగుతుందని.. గ్రామంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నర్సింగ్ చదువుతున్న విద్యార్థి దేవి తెలిపింది.
సెల్ఫోన్ సిగ్నల్ అందుబాటులో లేకపోవటంతో గిరిజన ప్రాంతాల్లోని ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దొర అన్నాడు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే.. ప్రభుత్వం స్పందించి సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరాడు.
ఇదీ చదవండి: Mavoist: విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూబింగ్..భయం గుప్పిట్లో గిరిజనులు