దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా విశాఖలో విద్యార్థి సంఘాలు మార్చ్ నిర్వహించాయి. మద్దిలపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో జేఎన్టీయూ అధ్యక్షురాలు అయిషీ ఘోషి పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతుని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబానికి చెందిన ప్రతి విద్యార్థి దిల్లీలో జరుగుతున్న అన్నదాతల ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరగదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పుకు అందరూ కట్టుబడాలి: సీపీఐ రామకృష్ణ