వేతన సవరణపై యాజమాన్యం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలను జరిపి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీల ఉద్యోగులు డిమాండ్ చేశారు. విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రేపు దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వరంగ, సాధారణ బీమా కంపెనీల్లోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు పాల్గొంటాయని తెలిపారు.
ఇదీ చదవండి: 'పురపోరుకు సన్నద్ధమవ్వండి'