ఉక్కు కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయడంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కార్మికులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. 14 కార్మిక సంఘాలకు చెందిన నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకూ వేతన బప్పందం అమలు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు.
యాజమాన్యం నిరంకుశ వైఖరితో ఒప్పంద అమలులో జాప్యం చేస్తోందని కార్మిక నాయకులు ఆరోపించారు. వేతన ఒప్పందాన్ని 2017 జనవరి నుంచి అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'స్వావలంబన, స్వయం సమృద్ధికి పీవీ పెద్దపీట వేశారు'