విశాఖ శ్రీశారదాపీఠం వార్షిక మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగో రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని స్వయంజ్యోతి మండపంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రాజశ్యామల యాగం, చతుర్వేద పారాయణలను వేద పండితులు నాలుగో రోజూ కొనసాగించారు. 80 మంది అర్చకులు వేదోక్తంగా యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు.
వైభవంగా విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు - ganamga Visakhapatnam Sri Sharda Peetam mahothsavalu news
విశాఖ శ్రీశారదా పీఠంలో వార్షిక మహోత్సవ వేడుకలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వయంజ్యోతి మండపంలోని స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించారు.