నేటి యువత చదువుకుంటూనే, రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. తమ కెరీర్‌లో భాగంగా ఉన్నత చదువులు అభ్యసిస్తూనే సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇందుకోసం వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. తాజాగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జీవీఎంసీ ఎన్నికల్లో నలుగురు విద్యార్థులు పోటీలో నిలిచారు. 20వ వార్డుకు చెందిన ఆదిమూలం శరణీదేవి జనసేన తరపున పోటీలో ఉన్నారు. ప్రస్తుతం యోగా టీచర్‌గా చేస్తున్న ఆమె.. ఎంఏ సైకాలజీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న తన మామ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు.
గతేడాది ఇంటర్న్‌షిప్ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అదే తేదీలో నామినేషన్ ఉండటంతో పరీక్ష రాయలేదు. ఇప్పుడు మళ్లీ అవకాశం రావటంతో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. ప్రస్తుతం కోర్సు నడుస్తోంది. కార్పొరేటర్‌గా అవకాశం వస్తే.. సేవ చేస్తాను. :26వ వార్డు తెదేపా అభ్యర్థిని ముక్కా శ్రావణి
నేను ఎంబీఏ చదువుతున్నాను. మా తల్లిదండ్రులకు రాజకీయ నేపథ్యం ఉన్నవారు... వారి స్ఫూర్తితో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఉంది. :21వ వార్డు తెదేపా అభ్యర్థి అవనిష్ యాదవ్
మొత్తం అభ్యర్థులు 566. ఇందులో10వ తరగతిలోపు.. 42.77శాతం, ఇంటర్మీడియట్/ఐటీఐ.. 18.01శాతం, డిగ్రీ.. 25.90శాతం, పీజీ/సాంకేతిక/వైద్య/ఇతర ఉన్నత విద్య.. 13.32శాతం ఉన్నారు. నగరంలో పోటీ చేసే అభ్యర్థులు 42.77శాతం మంది 10 తరగతి, అంతకన్నా తక్కువ చదువుకున్న వారు ఉన్నారు. ఇందులో 4 శాతం నిరక్షరాస్యులున్నట్లు చెబుతున్నారు. 39.22శాతం మంది డిగ్రీ, అంతకన్నా ఎక్కువ చదువుకున్న వారు బరిలో ఉన్నారు. కొన్నివార్డుల్లో విద్యావంతులు ఎక్కువగా పోటీ పడుతున్నారు.
ఇదీ చదవండీ.. దిక్కుమొక్కులేని వ్యక్తికి.. పోలీసుల సేవలు