రాష్ట్రంలో రైతులు ఎవ్వరూ తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వాటి కొనుగోళ్లకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ కూలీలు పొలాల్లో పని చేసేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కూలీల రవాణా సామాజిక దూరం పాటిస్తూ చేయాలన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు ఉంచేందుకు రైతుబజార్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: