ETV Bharat / state

విగ్రహాల తయారీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్​..కార్మికులకు లేని ఉపాధి - విశాఖ జిల్లా వార్తలు

మరికొన్ని రోజుల్లో దసరా ఉత్సవాలు సమీపిస్తున్నాయి. అయితే పండుగ దగ్గర పడుతున్నా అమ్మవారి విగ్రహాల వ్యాపారం ఊపందుకోలేదు. ఈ ఏడాది కరోనా కారణంగా విగ్రహాల తయారీ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. వినాయక చవితికి విగ్రహాల వ్యాపారం మందకొడిగానే సాగింది. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేకపోవటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పడు దసరాకు పరిస్థితి ఏం మారలేదు. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతులు లేవు. ఉన్నచోట నామమాత్రంగానే విగ్రహాలు పెడుతున్నారు. దీంతో దీన్నే నమ్ముకుని బతుకుతున్న వారి జీవనం ప్రశ్నార్థకమైంది.

Corona effect on the statue-making industry
విగ్రహాల తయారీ పరిశ్రమపై కరోనా ప్రభావం
author img

By

Published : Oct 9, 2020, 2:15 PM IST

కరోనా అన్ని రంగాలపైనా ప్రభావం చూపింది. వినాయక, అమ్మవారి విగ్రహాల తయారీ పరిశ్రమపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా లాక్​డౌన్ కారణంగా బొమ్మల తయారీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్​డౌన్​తో దూరప్రాంతాల నుంచి ఆర్డర్లు లేక ఎగుమతులు ఆగిపోయాయి. ఉన్న ప్రాంతంలోనూ అరకొరగానే విగ్రహాలు పెడుతున్నారు. దీంతో తయారీ నామమాత్రంగా సాగుతోంది. ఏటా లక్షల్లో తయారుచేసేవారు నేడు వందల్లోనే బొమ్మలు చేస్తున్నారు.

అమ్మవారి విగ్రహాలు చేయటంలో విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గం వారు ఏడాది పొడవునా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు. రావికమతం, రోలుగుంట మండలాల్లోని కొత్తకోట, దొండపూడి , కంచుగుమ్మల, భోగాపురం తదితర ప్రాంతాల్లో విగ్రహాల తయారీకి సంబంధించి కుటీర పరిశ్రమలు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. వీటి తయారీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వాటితో విగ్రహాలు చేసి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతి చేస్తుంటారు. తద్వారా ఏటా రూ. 20 నుంచి రూ. 25 లక్షల వ్యాపారం చేస్తుంటారు.

అయితే ఈ ఏడాది కరోనా కారణంగా పరిస్థితులు తారుమారయ్యాయి. విగ్రహాల తయారీ పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుంది. పండుగల సంబరాలు నిర్వహించడానికి అనుమతులు లేకపోవటంతో ఆ ప్రభావం వీరిపై పడింది. ఎగుమతులు లేక నామమాత్రంగా విగ్రహాలు తయారుచేస్తున్నారు. వీటి తయారీ కోసం మార్చి నెల నుంచి అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. అయితే ఈసారి లాక్​డౌన్ కారణంగా ఈ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. పనుల్లేక తయారీదారుల ఉపాధికి గండిపడింది.

ఇవీ చదవండి..

చనిపోయిన బాబుకు వైద్యం.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.