విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం పోయిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సంపాదించి, స్థిరపడిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు.. తాము పుట్టిన ప్రాంతాల్లో విద్యపై అవగాహన కల్పించి, ముందుకు తీసుకువెళ్లాలని సంకల్పించారు. దీనిలో భాగంగా అత్యంత ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉన్న గుల్లెలు పుట్టులో ఆదివాసి విద్య అనే కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాంతం చుట్టూ దట్టంగా కొండలు ఉన్నా పట్టించుకోకుండా సుమారు 1500 మంది విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడేరుకు చెందిన కృష్ణారావు అనే ఉపాధ్యాయులు విద్య, వైద్యం, ఉన్నత చదువుల ప్రోత్సాహం వంటి విషయాలపై చర్చించారు. గతంలో జంతువులు ఉన్న కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించారని భాజపా నాయకులు పాంగి రాజారావు అన్నారు. తమ గూడేల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: