భారత నౌకాదళం, సింగపూర్ నేవీ, రాయిల్ థాయ్ నేవీలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న 'సిట్ మెక్స్-2019 విన్యాసాలు పూర్తయ్యాయి. అండమాన్ నికోబార్ దీవులు వేదికగా జరిగిన ఈ విన్యాసాలలో రన్ వీర్, కొరా నౌకలు, భారత నౌకాదళం పాల్గొన్నాయి. సింగపూర్ నేవీకి చెందిన టెనాకొయిస్, థాయ్ నేవీకి చెందిన క్రబూరి నౌకలు ఐదు రోజుల పాటు ఈ సంయుక్త విన్యాసాల్లో భాగస్వాములైయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతం..భద్రత-వాణిజ్య అంశాల్లో కీలకంగా ఉంది. ఈ నేపధ్యంలో భారత్, థాయ్,సింగపూర్ లకు చెందిన నేవీ బృందాలు ఈ ప్రాంతంలో నౌకా విన్యాసాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చూడండి: