రాష్ట్ర శాసనసభాధిపతి తమ్మినేని సీతారాం సతీసమేతంగా సింహగిరిపై కొలువైన శ్రీ లక్ష్మి వరాహనృసింహస్వామిని దర్శించుకున్నారు. వీరిని దేవస్థానం ఈఓఏం వేంకటేశ్వరరావు పూర్ణకలశంతో ఎదురెళ్లి ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు. అర్చకులు వెదమంత్రాలతో సీతారాం దంపతులను ఆశీర్వదించారు. సతీసమేతంగా ఆలయంలో కుప్పస్తంభాన్ని ఆలింగనము చేసుకున్నారు. పూజనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి వీరికి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందచేశారు. కొండపై జరుగుతున్న అభివృద్ధి పనలను శాసనసభాధిపతి పరిశీలించి ఆలయ అధికారులతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు ఏవైనా కూల్చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయని సీఎం అయినా సామాన్యులైన చట్టం ముందు ఒకటేనని అన్నారు, అవినీతి విషయంలో కాస్త కఠినంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని సీతారం పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఘనంగా గణనాథుని నిమజ్జనం..