సింహాద్రి అప్పన్న హిల్ టాప్ రహదారిలో కొన్నేళ్లుగా వృథాగా ఉన్న అతిథి గృహ భవనాలను త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తామని దేవస్థానం ఈవో ఎంవీ. సూర్యకళ పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఇంజినీరింగ్ శాఖ అధికారులతో కలిసి సింహగిరిపై పలు ప్రాంతాల్లో పర్యటించారు. అతిథి గృహాలను బాగుచేసి భక్తులకు రాత్రిపూట వసతి పొందేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భవనాల వద్దకు వెళ్లే మార్గంలో చేసి వీధిదీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: