విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న దేవస్థానం నూతన ఈవోగా డి.భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న ఈవో ఎం.వెంకటేశ్వరరావు మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భ్రమరాంబ గతంలో మూడుసార్లు ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో.. నేడు దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎం.వెంకటేశ్వరరావు పై అనేక ఆరోపణలు రావడంతో ఆయనను బదిలీ చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు లేకుండా పనులు ప్రారంభించడం, చందనోత్సవంలో అజ్ఞాత భక్తుడు దర్శనం.. ఇలాంటి అనేక కారణాలు వెంకటేశ్వరరావు బదిలీకి దారితీశాయి.
ఇదీ చదవండి: వైకాపా గూటికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు