ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖ సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం నేడు వరాహ పుష్కరణిలో వైభవంగా జరిగింది. వేణుగోపాలస్వామి అలంకరణలో అప్పన్నస్వామి.. ఉభయదేవేరులతో హంసవాహనంపై విహరించారు. ప్రతి ఏటా బహుళ పుష్య అమావాస్యరోజు జరిపే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారిని సాయం సంధ్య వేళ సింహగిరిపై నుంచి పల్లకిలో పుష్కరణివద్దకు మంగళవాయిద్యాల నడుమ తీసుకువచ్చారు.
ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహంపై ఆశీనులను గావించి మూడు సార్లు విహరింపజేసి పుష్కరిణి మధ్యలో ఉన్న మండంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి వస్తుండగా భక్తులహరినామ స్మరణలతో పుష్కరిణి పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఉత్సవం అనంతరం స్వామివారిని సర్వజన మనోరంజని వాహనంపై మాఢ వీధుల్లో తిరువీధి నిర్వహించారు.
ఇదీ చదవండి: