విశాఖ సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో భక్తులు ఇప్పటివరకు నీలాద్రి గుమ్మం మధ్య నుండే లఘు దర్శనం చేసుకునేవారు. అయితే ఆదివారం నుంచి దర్శనంలో సడలింపులు ఇచ్చారు అధికారులు. భోగ మండపం నుంచే అప్పన్న దర్శనం కల్పించారు. రూ.300 అతి శిఖర దర్శనం టికెట్ కొనుగోలు చేసి దర్శనం చేసుకున్నారు.
లాక్డౌన్ అనంతరం జూన్ 10 నుంచి నిబంధనలకు లోబడి భక్తులు, ప్రముఖులకు స్వామి దర్శనం కల్పిస్తున్నారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు భోగ మండపం నుంచి దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థాన ఏఈవో ఆనంద్ కుమార్ తెలిపారు. త్వరలో నిబంధనలు మరింతగా సడలించి అవకాశం ఉందన్నారు.
సింహగిరిపై భక్తుల తాకిడి
సింహగిరిపై మూడు రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆలయ శుద్ధి నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత..భక్తులకు దర్శనం కల్పిస్తామని ఏఈవో తెలిపారు.
ఇదీ చూడండి: