విశాఖ జిల్లా జీకే వీధి మండలం సీలేరులో రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 540 కిలోల గంజాయి శీలావతి రకానికి చెందిందని చెప్పారు. దీనిని వాహనంలో తెలంగాణకు తరలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. గంజాయి తీసుకెళ్తున్న ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: MURDER: మద్యం సేవించి కుమారుడు వేధింపులు..హత్య చేసిన తండ్రి