విశాఖ జిల్లా కృష్ణదేవిపేటలో అక్రమంగా తరలిస్తున్న 132కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోద్యం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరకు విలువ సుమారు రెండున్నర లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి రూ.3,250 నగదుతో పాటు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా వెనుక విశాఖ మన్యం ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారుల పాత్ర ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: