విశాఖ జిల్లా అనకాపల్లి విజయరామరాజుపేటలో.. అప్పులబాధ తాళలేక ఓ సెక్యూరిటీ గార్డు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఉంగరాల పరమేశ్వర రావు (35)... ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేవాడు. ఇటీవల అప్పులు ఎక్కువ అవడంతో మనస్థాపం చెందిన ఆయన పురుగుల మందు తాగాడు.
చికిత్స కోసం అతడిని విశాఖకు తరలించినా.. కాసేపటికే మరణించాడు. మృతుడి తల్లి పద్మ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరమేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని అనకాపల్లి పట్టణ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: