ETV Bharat / state

27న పట్టాలెక్కనున్న రెండో ఉదయ్ ఎక్స్​ప్రెస్! - విశాఖపట్నం-విజయవాడ

దేశంలోనే... రెండో ఉదయ్ ఎక్స్​ప్రెస్ రైలు.. రాష్ట్రంలో పట్టాలెక్కనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రైలులో వైఫైతో పాటు కాఫీ, టీ మిషన్లు, టీవీలు ఏర్పాటు చేశారు. ఆహారం తినడానికి వీలుగా డైనింగ్ ప్రదేశం కూడా అందుబాటులో ఉంచారు. పూర్తి ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో ఉన్న ఈ రైలును విశాఖ - విజయవాడ మధ్య నడపనున్నారు.

త్వరలోనే పట్టాలెక్కనున్న ఉదయ్ ఎక్స్​ప్రెస్
author img

By

Published : Aug 22, 2019, 6:17 PM IST

త్వరలోనే పట్టాలెక్కనున్న ఉదయ్ ఎక్స్​ప్రెస్

దేశంలో రెండోది.. రాష్ట్రంలో మొదటిది అయిన ఉదయ్ ఎక్స్​ప్రెస్ డబుల్ డెక్కర్ రైలు ఈ నెల 27 న పట్టాలెక్కనుంది. పూర్తి ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో ఉన్న ఈ రైలు విశాఖపట్నం - విజయవాడ మధ్య రాకపోకలు చేయనుంది. ప్రస్తుతం ఈ తరహా రైలు బెంగళూరు సిటీ - కోయంబత్తూరుల మధ్య నడుస్తోంది. ఆధునిక రైల్వేలలో ఉదయ్ ఎక్​ప్రెస్​ పేరిట రెండతస్థుల రైలు (డబుల్ డెక్కర్ రైలు) ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు విశాఖ -విజయవాడల మధ్య డే ట్రైన్​గా నడవనుంది.

ప్రతి కోచ్​లోనూ పై అంతస్తు, కింది అంతస్తులలో కలిపి మొత్తం 120 సీట్లు ఉంటాయి. 50 సీట్లు పై డెక్​లోనూ, 48 సీట్లు కింది డెక్​లోనూ ఉండగా... బోగీకి ఇరువైపులా 22 సీట్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్న ఈ రైలులో వైఫై కాఫీ, టీలు విక్రయించే మిషన్లు, టీవీ ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు బోర్ అనిపించినపుడు నలుగురు నిల్చుని కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా ప్రతి బోగీలోనూ ప్రత్యేకంగా స్ధలాన్ని నిర్దేశించారు.

ఈ నెల 27న విశాఖ - విజయవాడల మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్​ప్రెస్​ను రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి.. ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:

అమరావతిపై.. మంటలు రేపుతున్న మాటలు

Intro:తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంతోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు బంగారు రథం పై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. బంగారు రథోత్సవాన్ని తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.....look

NOTE:SVBC LIVE AVAILABLE

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.