విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఆయకట్టులో వరినాట్లకు భారీగా నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచారు. తొలుత ఆదివారం దిగువ, ఎగువ సాగునీటి కాలువలకు 120 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఆయకట్టు ప్రాంతంలో వరినాట్లు ముమ్మరంగా జరగడంతో సోమవారం జలవనరుల శాఖ అధికారులు సాగునీటిని రెండో సారి విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి దిగువ కాలువకు 125 క్యూసెక్కులు, ఎగువ కాలువకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని ఆయకట్టుకు పంపిస్తున్నట్లు జలవనరుల శాఖ ఏ.ఈ.ఈ రామారావు 'ఈటీవీ, ఈటీవీ భారత్కు చెప్పారు.
జలాశయం నుంచి లీకేజీల రూపంలో మరో 45 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందన్నారు. కోనాం జలాశయం పరిధిలో ఐదు మండలాలకు 14,450 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగునీటికి డోకా ఉండదన్నారు. రైతులు జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటిని వృథా చేయకుండా, వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఇవీ చదవండి