విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాల పాలెంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కొందరు తమను ఇబ్బందులకు గురి చేశారని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి బొంతు జయలక్ష్మి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డను గ్రామస్థులతో కలిసి ఎస్ఈసీని కలిశారు.
దాదాపు 400 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు వేశారని.. అప్పటికే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వివరించారు. ఎవరూ పట్టించుకోని కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను ఆశ్రయించినట్లు బాధిత వర్గం వెల్లడించింది. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: