విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దిల్లీలో పర్యటిస్తున్నారు. ముందుగా భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మ పరిరక్షణకు పీఠం చేపడుతున్న కృషిని ఆయనకు వివరించారు. అయోధ్యలో విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వంతో చర్చించి స్థల కేటాయించాలని కోరుతూ మనోహర్ జోషీకి లేఖ అందించారు.
తరువాత కేంద్ర మంత్రి రాందాస్ బందు అతావలే నివాసానికి వెళ్లారు. విశాఖలో పీఠం చేపడుతున్న ధార్మిక కార్యకలాపాలను ఆయనకు వివరించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కలిసిన స్వామి స్వాత్మానందేంద్ర... కుంభమేళా గురించి చర్చించారు. హరిద్వార్ వేదికగా జనవరి నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాలో పీఠం చేపట్టబోయే సేవా కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర సహకారం అందేలా ప్రయత్నించాలని కోరుతూ లేఖ అందజేశారు.
ఇదీ చదవండి: