తమకు బకాయిపడ్డ 18 నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 18 వేల జీతం తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. ప్రమాద బీమా కల్పించాలని కోరారు. మరిన్ని ఇతర డిమాండ్లతో.. వారంతా విశాఖ జిల్లా నర్సీపట్నంలో.. రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇళ్లలో ఆందోళన చేపట్టారు.
సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో తమకు కనీసం రక్షణ కవచాలను అందజేయాలని వారు కోరారు. ప్రధానంగా పాదరక్షలు, శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇవీ చదవండి: