ETV Bharat / state

'ఆ వినాయకుడిని దర్శించుకుంటే అన్ని శుభాలే'

author img

By

Published : Aug 21, 2020, 12:31 PM IST

కోరిన కోర్కెలు నెరవేర్చి... భక్తుల పాలిట కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు విశాఖలోని సంపత్ వినాయకుడు. ఏ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉండే ఈ బొజ్జగణపయ్య ఆలయంలో నిత్యం గణపతి హోమం, అభిషేకాలకు భక్తులు బారులు తీరుతుంటారు. గణపతి నవరాత్రులకు ఇక్కడ ప్రత్యేక అలంకరణలు భక్తులను పరవశింపజేస్తాయి.ఈ సారి కొవిడ్ నిబంధనల ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

sampat vinayaka temple in visakha
విశాఖలోని సంపత్ వినాయక ఆలయం

విశాఖనగరంలోని ఆశీల్ మెట్ట సమీపంలో సంపత్ వినాయకుడిని 1950వ దశాబ్దంలోనే సంబంధన్ అండ్ కంపెనీ తమ కార్యాలయం ఎదురుగా ప్రతిష్టించుకుంది. అప్పట్లోనే తమిళనాట నుంచి అర్చకస్వామిని తీసుకువచ్చి నిత్యం పూజలు ఆరంభించింది. తెల్లవారుజామున ప్రతి రోజూ గణపతి హోమం, హవనం, మూలవిరాట్టుకు అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ జరిగే ఆర్చనల కోసం భక్తులు కొన్ని నెలలు తరబడి తమ వంతు వచ్చే వరకు వేచి ఉంటారు. తమిళ, తెలుగు సంప్రదాయాలు ఇక్కడ కన్పిస్తాయి.

  • మనోభీష్టాలను నెరవేర్చే స్వామి..

ప్రత్యేకించి గణపతి నవరాత్రులలో స్వామిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరిస్తారు. స్వామి వారిని పూజిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం. భారత్- పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడం... ఆ తర్వాత నావికాదళాధికారి ఇక్కడ మొక్కు తీర్చుకోవడం వంటివి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి.

  • వైభవంగా గణపతి నవరాత్రులు..

ప్రతీ ఏడాది గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ ఏడాదే ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేశారు. స్వామికి మహా కుంభాభిషేకం కూడా భారీ స్థాయిలోనే జరిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. ఆలయ పూజలు, ఇతరత్రా ఉత్సవాల నిర్వహణ, సేవలు, వంటివి అన్నీఆలయ వ్యవస్ధాపక సంస్ధ సంబంధన్ అండ్ కంపెనీ కుటుంబ సభ్యుల నిర్వహణలో ఉన్నాయి.

ఇవీ చదవండి: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.