దసరా నేపథ్యంలో నర్సీపట్నం ఆర్టీసీ డీపో నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు నర్సీపట్నం డిపో నుంచి అన్నవరం, భద్రాచలం, ద్వారకా తిరుమల తదితర పుణ్యక్షేత్రాల మీదుగా ఈ సర్వీసులను తిప్పేందుకు సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న కనకదుర్గ ఆలయం వద్ద కరపత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేశారు.
నర్సీపట్నం నుంచి విజయవాడ వరకు వెళ్లే పల్లె వెలుగు బస్సుకు రూ.600, అల్ట్రా పల్లె వెలుగు బస్సు రూ. 700, ఎక్సైజ్ సర్వీస్‌కు రూ. 840, అల్ట్రా డీలక్స్ బస్సు రూ. 1040 రూపాయల చొప్పున టికెట్లను ప్రకటించారు. దసరా పండుగ నేపథ్యంలో ఈ సర్వీసులను భవానీ భక్తులతో పాటు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సూర్య పవన్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: