కార్తికమాసం సందర్భంగా పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని రీజనల్ మేనేజర్ ఎం.వై. దానం తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ద్వారకా బస్‌స్టేషన్ నుంచి పంచారామాలకు బస్సు బయల్దేరిందని రీజనల్ మేనేజర్ ఎం.వై దానం వెల్లడించారు.
సోమవారం అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరంలలోని శైవ క్షేత్రాల దర్శనం చేయించి రాత్రికి విశాఖపట్నం చేరుతుందన్నారు. నవంబరు 29, డిసెంబరు 6, 13 తేదీల్లో ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయల్దేరుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: