కరోనా లాక్డౌన్ కారణంగా 45 రోజులుగా సేవలు నిలిచిన కారణంగా.. ఆర్టీసీకి తీరని నష్టాలు వాటిల్లాయి. వాటిని కాస్త తగ్గించుకునేందుకు.. సంస్థ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే కార్గో పేరిట గ్రామాల్లోకి సరుకుల రవాణాకు ప్రత్యేక వాహనాలను రూపొందిస్తోంది.
ఈ చర్యతో కొంతైనా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు నర్సీపట్నానికి సంబంధించి సుమారు 90 బస్సులతో గ్రామీణ ప్రాంతాలకు.. పూలు, కూరగాయలను రవాణా చేస్తూ.. సేవలందిస్తోంది. నష్టాల్లో ఉన్న నర్సీపట్నం డిపోని గట్టెక్కించేందుకు మూడు సర్వీసులను నడుపుతున్నట్లు మేనేజర్ సూర్య పవన్ కూమార్ తెలిపారు.
ఇదీ చూడండి: