పీపుల్స్ ఫర్ ఇండియా ఫోరం సంస్థ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థికమాంద్యం... కారణాలు.. పరిష్కార అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని మేథావులు, ఆర్థిక రంగ నిపుణులు హాజరయ్యారు. సమస్య తీవ్రత కారణంగా నిరుద్యోగ సమస్య పెరుగుతోందనే అభిప్రాయాలను పలువురు నిపుణులు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు కావడం అనేది ప్రతికూల ప్రభావం చూపుతోందని కొందరు విశ్లేషించారు.
ఇదీ చూడండి: 'ఒడుదొడుకుల్లో ఆటోమొబైల్ రంగం.. పరిష్కారానికి కృషి'