విశాఖ జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
మాకవరపాలెం మండలం శెట్టి పాలెం వద్ద... తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామానికి చెందిన వృత్తుల మహాలక్ష్మి నాయుడు , ఆదాపు రెడ్డి రాంబాబు అనే వ్యక్తులు.. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనం పై నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిని ఢీకొన్న వాహన వివరాల కోసం మాకవరపాలెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కశింకోట మండలం ఎన్ జీ పాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. జంగం తరుణ్ కుమార్ అనే వ్యక్తి ఏలూరు నుంచి వడ్లపూడికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో జాతీయ రహదారి పక్కగా ఉన్న బస్ స్టాపుని ఢీ కొట్టడం తో అక్కడికక్క డే మృతి చెందారు.
ఇదీ చదవండీ.. కోడి పందాల బరిలో ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు