ETV Bharat / state

విశాఖ రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం... పోలీసుల అదుపులో డ్రైవర్ - vishakapatnam crime news

విశాఖలో అదివారం లారీ బీభత్సం కారణంగా ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డ వారిని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమందిని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. లారీ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాకు చెందిందిగా గుర్తించిన పోలీసులు డ్రైవర్ గొవింద్​ను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ రోడ్డు ప్రమాదం
విశాఖ రోడ్డు ప్రమాదం
author img

By

Published : Oct 12, 2020, 10:25 AM IST

విశాఖలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ చేసిన బీభత్సానికి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న విజయనగరం జిల్లా బలిజపేట మండలానికి చెందిన పైలా రాము(29), పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చెందిన చింతలపూడి రామకృష్ణరాజు(30) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు కాళ్లు విరిగిపోగా..ఆటోలో ప్రయాణీస్తున్న వారికి బలంగా గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న ద్వారకా జోన్ ఏసీపీ వీఎస్ఆర్ మూర్తి, ఏడీసీపీ వేణుగోపాల్​నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. సుమారు 8 మందిని కేజీహెచ్​లో చికిత్స అందించగా, కొంతమందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆరిలోవ సీఐ ఇమ్మాన్యుయేల్​రాజు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. లారీ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాకు చెందిందిగా గుర్తించారు. లారీ డ్రైవర్​ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి

విశాఖలో లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.