ACCIDENT: విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విజయనగరం జిల్లా శంబర, గోపాలపురాని చెందిన ఎం. రాము(28), బి సత్యనారాయణ(40) లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. తగరపువలస సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ నగరంలోని పీఎం పాలెం ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటూ అక్కడే నివాసముంటున్నారు. శంబర యాత్ర ముగించుకొని గత రాత్రి పీఎం పాలెేనికి బయలుదేరారు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సమాచారాన్ని భీమిలి పోలీసులు బంధువులకు తెలియజేయడంతో ఇవాళ ఉదయం భీమిలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ACCIDENT: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి - విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం
ACCIDENT: విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.
ACCIDENT: విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విజయనగరం జిల్లా శంబర, గోపాలపురాని చెందిన ఎం. రాము(28), బి సత్యనారాయణ(40) లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. తగరపువలస సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ నగరంలోని పీఎం పాలెం ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటూ అక్కడే నివాసముంటున్నారు. శంబర యాత్ర ముగించుకొని గత రాత్రి పీఎం పాలెేనికి బయలుదేరారు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సమాచారాన్ని భీమిలి పోలీసులు బంధువులకు తెలియజేయడంతో ఇవాళ ఉదయం భీమిలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'