విశాఖలో రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి - విశాఖలో రోడ్డు ప్రమాదం
విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివాహిత మృతి చెందింది. కంచరపాలెం నుంచి మురళినగర్ వైపు బైక్పై రమాదేవి, శ్వేత అనే ఇద్దరు మహిళలు బైక్ పై వెళ్తుండగా.. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్ డ్రైవ్ చేస్తున్న శ్వేత ప్రాణాపాయం నుంచి బయటపడగా.. రమాదేవి తీవ్ర గాయాలపాలై చనిపోయారు. ఆమెను.. నగరానికి చెందిన ఇమ్మిగ్రేషన్ ఎస్ఐ మోహన్ రావు భార్యగా పోలీసులు గుర్తించారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ఈ ప్రమాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
విశాఖలో రోడ్డు ప్రమాదం..భార్య, భర్త మృతి