పొట్టకూటికి పయనమైన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంగ్రామానికి చెందిన పి. నరసింహమూర్తి (25), యానాంకు చెందిన ప్రసాద్ (26) అనే వ్యక్తులు.. అనకాపల్లి మండలం మాక వరం గ్రామానికి చెందిన అప్పారావు వద్ద లైటింగ్ పని చేసేవారు.
ఈ క్రమంలో సొంత ఊరు నుంచి పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి.. దాని పక్కనే వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలిని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Sileru complex: 35 రోజుల తర్వాత.. సీలేరులో మళ్లీ విద్యుదుత్పత్తి!