Massive Fire Broke Out From Bus in Vijayawada : విజయవాడ గవర్నరుపేట-2 డిపో వద్ద ఆగి ఉన్న బస్సు నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. కాళేశ్వరరావు మార్కెట్-గన్నవరం మార్గంలో తిరిగే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును మెయింటెన్‌నెస్ కోసం రాత్రి సుమారు 11 గంటల సమయంలో డ్రైవర్ డిపో వద్ద నిలిపి ఉంచారు. అయితే గంటన్నర తరువాత బస్సు నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన కొందరు ఆర్టీసీ సిబ్బంది వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. చివరికి మంటలు పెద్దవిగా వ్యాపించడంతో ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థాలానికి చేరుకున్న ఆ శాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనపై గవర్నరుపేట-2 డిపో మేనేజర్ సురేష్ మాట్లాడుతూ, డ్రైవర్ బస్సును మెయింటెన్‌నెస్ కోసం తీసుకు వెళ్లేలోపే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ క్యాబిన్, బస్సు లోపలి 8 సీట్ల వరకూ కాలిపోయిందని తెలిపారు. దీంతో సుమారు రూ.1.2 నుంచి 1.5 లక్షల వరకు నష్టం ఉంటుందన్నారు. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ చేయిస్తున్నామన్నారు.
మంటల్లో దగ్దమైన జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులు
హైవేపై పేలిన పెట్రోల్ ట్యాంకర్ టైర్ - భారీగా చెలరేగిన మంటలు - petrol tanker burst into flames