విశాఖ జిల్లా చోడవరం పీఎస్.పేట రహదారిలో బాలికోన్నత పాఠశాల ప్రహరీని ఆనుకుని బడ్డీదుకాణాలు ఏర్పాటు చేసుకుని పలువురు జీవనం సాగిస్తున్నారు. నాడు- నేడులో భాగంగా బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. పాఠశాలను అభివృద్ధి చేసేందుకు బడ్డీదుకాణాలు అడ్డుగా ఉన్నాయని పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయులు జిల్లా అధికారులకు తెలిపారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారుల సంయుక్త అధ్వర్యంలో వాటి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. బడ్డీదారులు వేడుకున్నా.. అధికారులు ప్రొక్లెయిన్ సాయంతో తొలగించేశారు.
పాఠశాల ఎదుట బడ్డీలు తొలగింపు - vizag taja news
విశాఖ జిల్లా చోడవరం పీఎస్.పేట రహదారిలో బాలికోన్నత పాఠశాల ప్రహరీ ఎదుట ఉన్న బడ్డీ దుకాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఏళ్లతరబడి బడ్డీలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఈ దుకాణాలు తొలగించి తమకు అన్యాయం చేయొద్దని బడ్డీదారులు వేడుకున్నారు. పాఠశాల అభివృద్ధికి బడ్డీలు అడ్డుగా ఉన్నాయనే తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.
విశాఖ జిల్లా చోడవరం పీఎస్.పేట రహదారిలో బాలికోన్నత పాఠశాల ప్రహరీని ఆనుకుని బడ్డీదుకాణాలు ఏర్పాటు చేసుకుని పలువురు జీవనం సాగిస్తున్నారు. నాడు- నేడులో భాగంగా బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. పాఠశాలను అభివృద్ధి చేసేందుకు బడ్డీదుకాణాలు అడ్డుగా ఉన్నాయని పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయులు జిల్లా అధికారులకు తెలిపారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారుల సంయుక్త అధ్వర్యంలో వాటి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. బడ్డీదారులు వేడుకున్నా.. అధికారులు ప్రొక్లెయిన్ సాయంతో తొలగించేశారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: దేవినేని ఉమ గృహ నిర్బంధం