ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖలో సినీ, టీవీ కళాకారులు ఆందోళన చేపట్టారు. ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీ అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కళాకారులంతా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అన్ని రంగాల వారికి చేదోడుగా నిలుస్తున్న తరుణంలో తమను కూడా ఆదుకోవాలని కోరారు. 40 ఏళ్లుగా సినీపరిశ్రమపై జిల్లాకు చెందిన 7500 మంది సినికార్మికులు ఆధారపడి బ్రతుకుతున్నామన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు.
ఇవీ చూడండి...