విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు విజయ్ కృష్ణ చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని 4 లక్షల 20 వేల చేపపిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు 500 కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతుందని వివరించారు. ఆరు నెలల కాలంలోనే అవి రెండు నుంచి మూడు కిలోల బరువు పెరుగుతాయన్నారు.
చీడికాడ మండలం కోనాం జలాశయంలోనూ చేప పిల్లలను విడుదల చేస్తామన్న ఆయన, దశలవారీగా అన్ని జలశయాల్లో చేపల పెంపకం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
అవిశ్రాంత కృషికి నిలువెత్తు నిదర్శనం సంపాదకుడు ముత్యాల ప్రసాద్